వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ తార సన్నీ లియోన్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమానికి తన భర్త డేనియల్ వెబర్‌తో వెళ్లింది. అవార్డుల ఫంక్షన్ ముగిశాక శనివారం రాత్రి ఇద్దరూ కారులో ఇంటికి తిరిగి వస్తుండగా.. దారిలో రోడ్డు మీద ఓ మహిళ తన కారు టైర్ మార్చేందుకు తెగ ఇబ్బందులు పడటం డేనియల్ కంట పడింది. అంతే వెంటనే ఆయన కారు ఆమె వద్దకు వెళ్లి సాయం చేశారు.
'ఇందుకే మీరు మా అందరికీ ఫేవరెట్ కపుల్' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా సన్నీ, డేనియల్ 2011లో వివాహం చేసుకున్నారు. వీళ్లు నిశా అనే అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. సరోగసీ ద్వారా ఇద్దరు మగ కవలలు నోవా, అశెర్‌కు జన్మనిచ్చారు.