సన్నిడియోల్, గోపీచంద్ మలినేని సినిమా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది

డీవీ

గురువారం, 20 జూన్ 2024 (13:20 IST)
D.Suresh babu clap on Sunnydiol
బాలీవుడ్ స్టార్ సన్నిడియోల్, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో (SDGM) చిత్రం నేడు హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. హిందీలో రూపొందనున్న ఈ సినిమాకు రెండు అగ్రనిర్మాణ సంస్థలైన మైత్రవీమూవీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నడుం కట్టాయి. రామానాయుడు స్టూడియోలో దేవుని గుడిలో సన్నిడియోల్ పై డి.సురేష్ బాబు క్లాప్ కొట్టి ప్రారంభించారు.
 
Sunnydiol movie opeing
దేశంలోనే అతిపెద్ద యాక్షన్ చిత్రంగా మాస్ ఫీస్ట్ లోడింగ్ అనే కాప్షన్ జోడించారు. ఈనెల 22 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రెజీనా కాసాండ్ర, నయామీ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. హిందీలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దక్షిణాది నాలుగు భాషల్లోనూ విడుదల చేయనున్నారు. అయితే రవితేజతో తీయాల్సిన ఈ సినిమాను సన్నీతో తీస్తున్నారనే టాక్ కూడా ఇండస్ట్రీలో నెలకొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు