నా కేరీర్‌లోనే మొదటిసారిగా ఒక పాత్రకోసం నేను చాలా కష్టపడి నటించానని నటి సమంత పేర్కొన్నారు. ప్రస్తుతం సమంత బహుభాషా నటిగా రానున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. గత ఏడాది సమంత నటించిన చిత్రాలన్నీ సక్సెస్ బాటలో నడిపించాయి. ఈ సంవత్సరం కూడా అదే రీతిలో హిట్ సాధించాలని సమంత ఆశ పడుతోంది.
ఇందులో ఫాహత్ ఫాజిల్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉంది. ఇందులో విజయ్ సేతుపతి మొదటిసారిగా హిజ్రాగానూ కొంచెం సేపు కనిపించనున్నారు. ఈ సినిమాలో నటి సమంత పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందట. ఇంతకు ముందు నటించిన చిత్రాలకంటే ఈ సినిమాలో నేను చాలా కష్టపడి నటించానని సమంత ఇటీవలే ఓ భేటీలో వెల్లడించారు.