ఇటీవల ఓ వ్యక్తి పేరు బాగా వినిపిస్తోన్న విషయం మీకు తెలిసిందే. తన సినిమా రిలీజ్‌కు రకరకాల కారణాలు చూపుతూ ఇష్యూను డైవర్ట్ చేస్తున్నాడు. సురేష్‌బాబు ఎందుకు దూరంగా వున్నారంటే ఇక్కడ ప్రతి నిర్మాణ సంస్థకు కొన్ని రూల్స్ వున్నాయి. డిస్నీ, నెట్‌ఫ్లిక్స్, ఆహా.. ఇలా కొన్ని సంస్థలకు ఎలాగైనా రూల్స్ పెట్టుకున్నారో వారు అలా పెట్టుకున్నారు. కానీ అవి అందరి ప్రయోజనాల కోసం చూసుకోవాలి. ఇది వ్యాపార రంగం కనుక ఎవరి అనుకూలంగా వారు రూల్స్ పెట్టుకుంటారు. ఒక్కోసారి మారుస్తుంటారు. దీనిపై ఛాంబర్‌కానీ, నిర్మాతమండలికికానీ చాలా వరకు రైట్స్ లేవు. గతంలో కొందరు ఈ విషయపై పోరాటం చేశారు. కానీ మరలా ఎక్కడి గొంగలి అక్కడే వుంది.
సినిమారంగంలో డిమాండ్ అండ్ సప్లయి. కాంతార సినిమా చిన్న సినిమా. కన్నడలో మారుమూల ప్రాంత కథ. అక్కడ బాగా ఆడిరది. తెలుగులో ట్రై చేద్దాం అని వేశారు. ఇరగబడి చూశారు. అలా అని ఇక్కడ సినిమాలు తక్కువకాదు. కానీ ఆ సినిమాకోసం ఎక్కువ థియేటర్లు ఇవ్వాల్సి వచ్చింది అంటూ తన శైలిలో చెప్పుకొచ్చారు. ఏదిఏమైనా నా సంస్థ నిర్మించే సినిమాలుకానీ, నా హీరోల నటించే సినిమాలు కానీ దేశంలో అన్నిచోట్ల షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. నలుగురికి పని కల్పిస్తుంది అని చెప్పారు. ఇక మోనోపొలీ పరిది ఎప్పటికైనా కొంతకాలమే అంటూ తెలిపారు.