ఇప్పుడు దర్జా, వాంటెడ్ పండుగాడ్, గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా మారిపోయింది. కానీ ఆమె గ్లామర్ తగ్గుతూ వచ్చేసింది. మొహం పీక్కుపోయినట్లుగా వయస్సు మీదపడినట్లుగా వుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఒకసారి మొహం చూసుకో ముసలిదానివైపోతున్నావ్ అప్పడే అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరైతే అసలు ఫేస్ ఇలానే వుంటుందా.. 'కొంచెం ఏజ్‌డ్‌గా ఉన్నారు' అంటూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరైతే నైస్ లుక్.. బ్యూటిఫుల్‌స.. కొత్త గెటప్పా అంటూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. వీటిపై అనసూయ ఇంకా స్పందించలేదు. చూద్దాం కొద్దిసేపటికి స్పందిస్తుందేమో.