దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

ఠాగూర్

మంగళవారం, 25 మార్చి 2025 (21:32 IST)
దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు, సినీ హీరో, దర్శకుడు మనోజ్ భారతీరాజా హఠాన్మరణం చెందారు. ఆయనకు వయసు 48 యేళ్లు. కొన్ని నెలల క్రితం ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఇంటిపట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఆయన ఉన్నట్టుండి కార్డియాక్ అరెస్ట్‌కు గురికావడంతో చెన్నై, చెట్‌పట్‌లోని ఆయన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 
 
తన తండ్రి భారతీరాజా దర్శకత్వం వహించిన తాజ్‌మహల్ చిత్రంతో వెండితెరకు హీరోగా పరిచయమైన మనోజ్.. ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అలాగే, విరుమన్, మానాడు వంటి చిత్రాల్లో కీలక పాత్రలను పోషించారు. 'మార్గళి తింగల్' అనే చిత్రానికి దర్శకత్వం వహించి తన తండ్రి భారతీరాజాను డైరెక్ట్ చేశారు. మనోజ్ మృతిపట్ల తమిళ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు