బుల్లితెర నటీమణి సబర్ణది హత్యా లేకుంటే ఆత్మహత్యా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చెన్నై, మదురైవాయిల్‌లోని తన ఇంట్లో విగతజీవిగా ఉండిన ఆమె మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సబర్ణ నగ్నంగా మృతిచెంది వుండగా.. ఆమె అత్యాచారానికి గురై.. హత్య చేయబడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఆమె చేతిని బ్లేడుతో తెగ్గోసినట్లు ఉందని.. సబర్ణ ఆత్మహత్య చేసుకున్నారా లేకుంటే ఆమెను ఎవరైనా రేప్ చేసి హత్య చేశారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సబర్ణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అపార్ట్‌మెంట్లో బీర్ బాటిల్స్, సిగరెట్లు, గంజాయి వంటి ప్యాకెట్లను కూడా పోలీసులు కనుగొన్నారు. ఇంకా ఇంటి తలుపులు తెరిచే వున్నాయని.. ఆమె డైరీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.