తన భర్త కార్తికేయన్ పలువురి వద్ద రూ.80 లక్షల మేరకు తీసుకుని వారిని మోసం చేశాడనీ, అందువల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోందని తమిళ నటి నదింత ఆరోపించింది. చెన్నై, టీ నగర్‌కు చెందిన కార్తికేయన్ అనే వ్యక్తిని తమిళ టీవీ నటి నందిత ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎనిమిది నెలల క్రితం వివాహం జరుగగా, నాలుగు నెలలకో మనస్పర్థలు తలెత్తాయి. దీంతో నందిత తన పుట్టింట్లో నివశిస్తోంది.
అంతేకాకుండా, తన భర్తకు మరో యువతితో కూడా వివాహేతర సంబంధం ఉందని, ఇదే విషయంపై ఆ యువతి పెట్టిన కేసులో కూడా తన భర్తను కార్తికేయన్‌ను కూడా అరెస్టు చేశారని తెలిపారు. అలాగే, తనను కేవలం డబ్బు కోసమే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనీ, తనపై ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదని వాపోయింది.