తండేల్ నుంచి సాయి పల్లవి స్పెషల్ పోస్టర్ విడుదల

డీవీ

గురువారం, 9 మే 2024 (10:42 IST)
Sai Pallavi Birthday Look
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'తండేల్'. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది జాతీయ అంశాలతో కూడిన బ్యూటీఫుల్ రూరల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టొరీ. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఈరోజు సాయి పల్లవి పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ పుట్టినరోజు స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సాయి పల్లవి నేచురల్ బ్యూటీగా వండర్ ఫుల్ ఎలిగెన్స్ తో కనిపించారు. మిలియన్ డాలర్ల స్మైల్స్ తో ఆకట్టుకున్నారు. పోస్టర్ లో ఆమె ఫోన్ మాట్లుతున్నట్లు కనిపిస్తున్నారు. 
 
టీజర్ విడుదలైన తర్వాత 'తండేల్' పై హ్యుజ్ బజ్‌ క్రియేట్ అయ్యింది. ఇందులో నాగ చైతన్య జాలరి పాత్రలో నటిస్తున్నారు. క్యారెక్టర్ కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు. 
 
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, శామ్‌దత్ డీవోపీగా పని చేస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు