ఒక్క అనుమానం, క్రిష్‌కు విడాకులిచ్చేలా చేసింది?

శుక్రవారం, 7 మే 2021 (18:53 IST)
సెలబ్రిటీలు డేటింగ్‌లు చేసుకోవడం.. విడిపోవడం మామూలే. ఇందులో కొత్తేంలేదన్నది తెలిసిందే. ఎన్నిరోజులు ఇష్టముంటే అన్నిరోజులు కలిసి ఉండడం.. లేకుంటే నిర్థాక్షిణ్యంగా విడిపోవడం సెలబ్రిటీలకు అలవాటే. అయితే ఈ మధ్య వచ్చిన సెలబ్రిటీలైతే టాటా బాయ్ బాయ్‌లు చాలా ఈజీగా చెప్పేసుకుంటున్నారు.
 
గమ్యం సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్సకుడు క్రిష్. ఆ తరువాత ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలను తీశాడు. సినీరంగంలో క్రిష్‌కు మంచి పేరే ఉన్నా ఫ్యామిలీ పరంగా మాత్రం చాలా అప్‌సెట్లో ఉన్నారు క్రిష్. ఒకరికొకరు అర్థం చేసుకున్న క్రిష్ భార్యాభర్తలిద్దరు కాస్త ఒక చిన్న అనుమానంతో విడిపోయారట. 
 
క్రిష్ 2016 ఆగస్టు 7వ తేదీన రమ్య అనే యువతిని వివాహం చేసుకున్నారు. రమ్య తండ్రి పారిశ్రామికవేత్త. ఆస్తిపరురాలు. అయితే వీరిద్దరు సంవత్సరం వరకు బాగానే కలిసి ఉన్నారు. కానీ ఆ తరువాత భర్తపై అనుమానంతో గొడవలు జరగడంతో చివరకు విడిపోయారట.
 
క్రిష్ దర్సకత్వంలో వచ్చిన సినిమాల్లోని  హీరోయిన్లతో బాగా దగ్గరగా ఉంటారని.. అది కాస్త రమ్యకు తెలియడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైందట. ఏ మాత్రం ఆలోచించకుండా విడాకులిమ్మని క్రిష్ పైన ఒత్తిడి తేవడంతో చివరకు క్రిష్ విడాకులు తీసుకున్నాడట. ఇప్పుడే ఎందుకు వీరి విడాకుల వ్యవహారం తెరపైకి వచ్చిందంటే సరిగ్గా 2017సంవత్సరంలో నిన్న వారికి విడాకులు మంజూరైన రోజట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు