అచ్చ తెలుగులో స్వచ్ఛమైన ప్రేమ కథ కాలమేగా కరిగింది : దర్శకుడు శింగర మోహన్

దేవీ

బుధవారం, 19 మార్చి 2025 (16:40 IST)
Kalamega karigindi team
వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. శింగర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. పొయెటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన "కాలమేగా కరిగింది" సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.

డైరెక్టర్ శింగర మోహన్ మాట్లాడుతూ - మూడేళ్ల కిందట మార్చి 21న "కాలమేగా కరిగింది" సినిమా స్క్రిప్ట్ చేశాను. ఈ మార్చి 21న మా మూవీ రిలీజ్ కు వస్తోంది.  డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారికి థ్యాంక్స్. ఆయన ప్రశంసలు మా సినిమాకు దక్కడం సంతోషంగా ఉంది. మా సినిమా పొయెటిక్ గా ఉంటుంది. ఈ కథను తన మ్యూజిక్ తో మరింత బ్యూటిఫుల్ గా తయారుచేశారు  సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ముందు థియేటర్స్ లో ఈ సినిమాను ఎలా ఎంగేజ్ చేస్తారు అని అన్నవాళ్లే..ఫైనల్ కాపీ చూసి ఈ సినిమాను థియేటర్స్ లోనే ఎంజాయ్ చేయాలి అన్నారు. అంత క్వాలిటీగా పోస్ట్ ప్రొడక్షన్ చేశారు మా టీమ్. "కాలమేగా కరిగింది" మ్యూజికల్ పొయెటిక్ లవ్ స్టోరీగా ఆకట్టుకుంటుంది. అన్నారు.
 
హీరో వినయ్ కుమార్ మాట్లాడుతూ - "కాలమేగా కరిగింది" ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. కలహాలే లేని ప్రేమ కథగా ఆకట్టుకుంటుంది. మా సినిమాను గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు సపోర్ట్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేను. జీవితంలో మనం సాధిస్తామని నమ్మేవారు ఎంత ముఖ్యమో, మనం ఏమీ చేయలేం అని నిరుత్సాహపరిచేవాళ్లు కూడా అంతే ముఖ్యం. నిరుత్సాహపరిచే వాళ్లు లేకుంటే మనలో సాధించాలనే పట్టుదల ఉండదు. ఈ సినిమాకు పనిచేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్. చిన్న చిత్రాలకు ఉండే ఇబ్బందులన్నీ పడ్డాం. మా మూవీని రిలీజ్ వరకు తీసుకురావడమే సక్సెస్ గా భావిస్తున్నాం. మా మూవీని థియేటర్స్ లో తప్పకుండా చూడాలని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ మరే శివశంకర్ మాట్లాడుతూ - "కాలమేగా కరిగింది" సినిమాకు సపోర్ట్ చేసిన డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారికి, ఆనంద్ దేవరకొండ అన్నకు థ్యాంక్స్. ఆదిత్య మ్యూజిక్ మా పాటలు బాగా రీచ్ అయ్యేలా సపోర్ట్ చేసింది. అచ్చ తెలుగులో చేసిన స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది.  మీరంతా మా మూవీని ఈ నెల 21న థియేటర్స్ లో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు