Mirai: తేజ సజ్జా మిరాయ్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు

దేవి

శనివారం, 22 ఫిబ్రవరి 2025 (11:53 IST)
Mirai date poster
హనుమాన్ సినిమా తర్వాత తేజ సజ్జా నటిస్తున్న సినిమా మిరాయ్. ప్రశాంత్ వర్మ సహకారంతో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం చేస్తున్నారు. ఊహాజనీతమైన సైన్ టి ఫిక్ కదాంశంతో రూపొందుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై TG విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.  ఈ చిత్రంలో తేజ  సూపర్ యోధగా నటిస్తున్నారు.
 
శనివారం నాడు మేకర్స్ సినిమా కొత్త విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ను అందించారు. పెద్ద స్క్రీన్‌పై ఉత్కంఠభరితమైన యాక్షన్ అడ్వెంచర్‌ను చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ, మిరాయ్ కోసం ఆగస్ట్ 1 కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్‌లను అందించడానికి అవసరమైన విస్తృతమైన VFX పని కారణంగా విడుదల ఉన్నతంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ పోస్టర్‌లో తేజ సజ్జ ఎత్తైన మంచు శిఖరాల మధ్య నిలబడి, చేతిలో పవర్ఫుల్ ఆయిదం పట్టుకుని చూస్తున్నట్లు కనపడుతోంది. 
 
కాగా,  ఇటీవలే నేపాల్‌లో షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో మనోజ్ మంచు విలన్‌గా నటిస్తుండగా, తేజ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది.  సాంకేతికసిబ్బందిగా, వివేక్ కూచిబొట్ల, కృతిప్రసాద్, సుజిత్కొల్లి, మణిబ్కరణం, గౌరహరికె శ్రీనాగేంద్ర ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు