వీటిపై శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తాజాగా మరోసారి స్పందించారు. తన భార్య సడెన్‌గా చనిపోవడంతో దుబాయ్ పోలీసులు తనను సుదీర్ఘంగా విచారించారని తెలిపారు. దాదాపు 48 గంటల పాటు అన్ని రకాలుగా ప్రశ్నించి, శ్రీదేవి మరణంలో ఎలాంటి కుట్ర లేదని తేలడంతోనే తనను వదిలిపెట్టారని చెప్పారు.
ఉప్పు, కారం లేని ఆహారం మాత్రమే, అదీ అతి తక్కువ పరిమాణంలో తీసుకునేదని వివరించారు. దీంతో శ్రీదేవి లోబీపీతో బాధపడేదని, తరచూ కళ్లు తిరిగి పడిపోయేదని బోనీ కపూర్ చెప్పారు. వైద్యులు చెప్పినా ఆమె తన ఆహారపుటలవాట్లను మార్చుకోలేదని వివరించారు.