ఇప్పటివరకు పాన్-ఇండియన్ సినిమాకు ఒకరు, ఇద్దరు నిర్మాతలు ఉండేవారు. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్. సినిమాలకు అంతే. కానీ ఇప్పుడు నిర్మాతలు మినిమమ్ ముగ్గురు కావాల్సివస్తుంది. సిండికేటుగా నిర్మాతలు మారి పెద్ద సినిమాలు తీస్తున్నారు. పాన్-ఇండియన్ యాక్షన్ కోసం ప్రభాస్, సిద్ధార్థ్ ఆనంద్‌తో కలిసి పని చేస్తారు. ఈ సినిమా షూట్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రభాస్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ కోసం అడ్వాన్స్‌లు చెల్లించింది. సిద్ధార్థ్ చెప్పిన కథకు ప్రభాస్ ఇటీవల అధికారికంగా ఆమోదం తెలిపాడు.