కొన్ని కుక్కలు అలానే మొరుగుతుంటాయ్.. వాటిని నియంత్రించలేం : నాగబాబు

గురువారం, 7 సెప్టెంబరు 2017 (13:39 IST)
ఈ సమాజంలో కొన్ని కుక్కలు అలానే మొరుగుతూ ఉంటాయనీ, వాటిని ఏవరూ ఆపలేరనీ సినీ నటుడు నాగబాబు అన్నారు. తమ ఫ్యామిలీ హీరోలపై కొందరు చేస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. 
 
ఈ సమాజంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిలో మనకు ఇష్టంలేనివి ఎన్నో ఉంటాయి. అవి జరగకూడదు అనుకుంటే కష్టం. అలాగే, కుక్క‌ల అరుపు నాకు ఇష్టం ఉండ‌దు. అలాగని దాన్ని నియంత్రించాల‌నుకోవడం పొర‌పాటు. అరుస్తున్న ప్ర‌తి కుక్క‌ని మ‌నం నియంత్రించ‌లేమ‌ని, వాటిని ప‌ట్టించుకోకుండా జీవితంలోపైకి ఎద‌గ‌డంపై దృష్టి సారించాల‌న్నారు. 
 
ముఖ్యంగా, 'మా నాన్న చ‌నిపోవ‌డం నాకు ఇష్టం లేదు. నేను ఆప‌గ‌లిగానా?, ఆయన చనిపోయారు. ఆ బాధను దిగమింగుకుని, మామూలుగా బ్రతికేస్తున్నాం. అన్ని విష‌యాల్లోనూ ఇలాగే ఉండాలి' అని నాగబాబు అన్నారు. 
 
అదేసమయంలో మెగా ఫ్యామిలీని అడ్డం పెట్టుకుని మాట్లాడే ప్ర‌తి ఒక్కరూ చేసే ప‌నుల‌కు తాము స‌మాధానం చెప్ప‌డం సాధ్యం కాద‌న్నారు. ప్ర‌తి చిన్న విష‌యం మీద దృష్టి సారించ‌కుండా, భ‌విష్య‌త్తులో కల్యాణ్ బాబుకు రాజకీయంగా ఉప‌యోగ‌ప‌డే ప‌నులు చేయాల‌ని అభిమానుల‌కు సూచించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. 
 
అభిమానులు రాను రాను త‌మ హీరోను అధిగ‌మించే స్థాయికి చేరుకుని, అత‌న్ని నియంత్రించే స్థాయికి ఎదుగుతార‌ని ఆయ‌న పేర్కొన్నారు. గ‌తంలో త‌మిళ న‌టుడు ఎంజీఆర్ అభిమానులు ఆయన్ని నియంత్రించిన సంద‌ర్భాల‌ను నాగబాబు గుర్తు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు