హోలీ వేడుకలను సంతోషంగా జరుపుకున్న నటి కొన్ని నిమిషాల్లోనే మరణించిందంటే నమ్మలేకపోతున్నారు ఆమె తోటి స్నేహితురాళ్లు, టాలీవుడ్ వర్ధమాన నటీనటులు. ప్రముఖ యూట్యూబర్, వర్థమాన నటి గాయత్రి శుక్రవారం రాత్రి గచ్చిబౌలి రోడ్డులో జరగిన కారు ప్రమాదంలో అక్కడికక్కడే మృత్యువాత పడింది.