హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు,సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న చిత్రం 'టుక్ టుక్'. ఈ చిత్రానికి సి.సుప్రీత్ కృష్ణ దర్శకుడు. చిత్రవాహిని మరియు ఆర్ వై జి సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణలు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు మేకర్స్. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మహా శివరాత్రి కానుకగా విడుదల చేశారు మేకర్స్.