#RajamouliMakeRamayan ట్విట్టర్‌లో రాజమౌళి రామాయణం ట్రెండ్

ఆదివారం, 3 మే 2020 (17:46 IST)
ఎస్ఎస్ రాజామౌళి.. టాలీవుడ్ అగ్ర దర్శకుడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ పేరుతో ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే, ఈయన రామాయణం, మహాభారతంను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారే వార్తలు ఎంతో కాలంగా హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందోగానీ, ఇపుడు ట్విట్టర్‌లో మాత్రం రాజమౌళి రామాయణం పేరుతో ఒకటి తెగ ట్రెండ్ అవుతోంది. రామాయణంను రాజమౌళి తెరకెక్కించాలంటూ ట్విట్టర్ యూజర్లు డిమాండ్ చేస్తున్నారన్నమాట. 
 
నిజానికి రామయణం, మహాభారతం అంటి ఇతిహాసాలు మనకు ఎన్నో నేర్పించాయి. వాటి నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఉందికూడా. అందుకే మ‌న ఫిలిం మేక‌ర్స్ కూడా ప్ర‌జ‌ల‌కి పురాణాల‌పై కొంత అవగాహ‌న క‌ల్పించేందుకు సీరియ‌ల్స్‌, సినిమాలు వంటివి తీశారు. 
 
గత 1980 దశకంలో రామాయ‌ణం, మ‌హాభార‌తం, శ్రీ కృష్ణ వంటి సీరియ‌ల్స్ ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఇవి ఎంత‌గానో అల‌రించాయి. ఇప్పుడు లాక్‌డౌన్ వ‌ల‌న రామానంద్ సాగర్ దర్శకత్వంలో నిర్మితమైన రామాయ‌ణం దూర‌ద‌ర్శ‌న్‌ పునఃప్ర‌సారం అవుతుంది. మూడు దశాబ్దాల తర్వాత ఈ రామాయణ సీరియల్‌ను ప్రజలు ఆదరిస్తున్నారు.
 
ఈ సీరియల్ కారణంగా దూరదర్శన్ ఎప్పుడూ లేని విధంగా టీఆర్పీలో అగ్రస్థానంలో నిలిచింది. ఏప్రిల్ 16న 7.7 కోట్ల మంది 'రామాయణం'ను వీక్షించారు. రామాయ‌ణం సీరియ‌ల్‌కి ఇంత డిమాండ్ వ‌చ్చిన నేప‌థ్యంలో రామాయ‌ణంని రాజ‌మౌళి సినిమాగా తీయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 
 
ఆదివారం ఉదయం నుండి #RajamouliMakeRamayan హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ ట్రెండింగ్‌లో నిలిపారు. గ‌తంలో ఇతిహాసాల‌పై సినిమాలు చేయాల‌నే ప్ర‌స్తావ‌న రాజ‌మౌళి ద‌గ్గ‌ర‌కి వ‌చ్చిన దానిని సున్నితంగా తిర‌స్క‌రించారు. మ‌రి తాజాగా నెటిజ‌న్స్ చేస్తున్న డిమాండ్‌పై  రాజ‌మౌళి ఏమైన స్పందిస్తారా అన్న‌ది వేచిచూడాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు