ఉదయ్‌తో ఐదేళ్లపాటు డేటింగ్ చేశారు... నర్గిస్ ఫక్రీ

సోమవారం, 13 సెప్టెంబరు 2021 (15:15 IST)
బాలీవుడ్ నటీనటులు పెళ్లికి ముందే డేటింగ్ చేయడం సర్వసాధారణం. ఇలాంటి వారిలో నర్గిస్ ఫక్రీ ఒకరు. ఈమె బాలీవుడ్ నటుడు ఉదయ్ చోప్రాతో ప్రేమాయణం సాగిస్తోందంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. 
 
ఇదే అంశంపై ఈ అమ్మడు తొలిసారి స్పందించారు. ఓ ప్రముఖ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఉదయ్, తాను ఐదేళ్లపాటు డేటింగ్ చేశామని వెల్లడించింది. తాను కలిసిన వ్యక్తుల్లో అందిరి కంటే గొప్పవాడు ఉదయ్ అని చెప్పుకొచ్చింది. 
 
ఉదయ్‌తో ఉన్న అనుబంధం గురించి ఇంతకాలం ఎందుకు స్పందించలేదనే ప్రశ్నకు బదులుగా... తమ అనుబంధం గురించి బయట ప్రపంచానికి వెల్లడించవద్దని తనకు చాలా మంది సూచించారు. అందుకే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు చెప్పారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు