యూట్యూబ్‌లో సెవెన్ ఆర్ట్స్ అనే వేదికగా బూతు మాటలతో వీడియోలు చేస్తూ బాగా హాట్ టాపిక్‌గా నిలిచింది సరయు. ఈమె వీడియోలను చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తుంటారు. నెగెటివ్ కామెంట్స్ పెడుతుంటారు. అయినా కూడా ఈ బోల్డ్ బ్యూటీ వాటిని పట్టించుకోకుండా మరింత బూతులతో రెచ్చిపోతుంది. మొత్తానికి ఈ బోల్డ్ బ్యూటీకి బిగ్ బాస్ లో అవకాశం రాగా అందులో తనేంటో నిరూపించుకోకపోగా మొదటి వారానికే ఇంటి పట్టు పట్టాల్సి వచ్చింది.
ఇలా ఉంటే నిన్నటి ఎపిసోడ్ లో మొత్తానికి ఎలిమినేట్ అయిన సరయు హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ పై ఫైర్ అయ్యింది. ఎవరు బెస్ట్, ఎవరు వరెస్ట్ అనే కాన్సెప్ట్‌లో ప్రతి ఒక్కరి గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది. ఇక వరెస్ట్ ప్లేస్‌లో షణ్ముఖ్‌ను పెట్టి అతడి గురించి కొన్ని కామెంట్స్ చేసింది. నిజానికి తను హౌస్ లో ఉన్నంత కాలం షన్నుతో కూడా అంతగా మూవ్ అయినట్లు కనిపించలేదు. ఇక నిన్న మాత్రం షణ్ముఖ్‌పై బాగానే ఫైర్ అయినట్లు అనిపించింది.
ఇక వరస్ట్ ప్లేస్ పెట్టడంతో షణ్ముఖ్ ఏమి అనలేకపోయాడు. ఇక ఈ ఎపిసోడ్ ను చూసిన ప్రేక్షకులు, షణ్ముఖ్ ఫ్యాన్స్ సరయు పై తెగ ట్రోల్స్ చేస్తున్నారు. షణ్ముఖ్ ను వరస్ట్ అనే ముందు నువ్వు ఎలాంటి వీడియోలు చేస్తావ్.. నువ్వు మాట్లాడే మాటలు ఏంటి అంటూ సరయు పై బాగానే ఆడుకున్నారు షన్ను అభిమానులు.