క్లీంకార కోసం కొత్త ప్రపంచాన్నే డిజైన్ చేయించిన ఉపాసన రాంచరణ్

శుక్రవారం, 14 జులై 2023 (16:18 IST)
Upasana house
రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులకు పుట్టిన బిడ్డకు పురాణాల్లో ఉన్న పేరు క్లీంకార అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఉపాసన ఆసక్తికర వీడియో పోస్ట్‌ చేశారు. ఆమె జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చారు. అయితే తనకు పుట్టబోయే బిడ్డకోసం ముందుగానే గదిని ప్రత్యేకంగా డిజైన్‌ చేయించారు. గది వాతావరణం ప్రకృతి ఒడిలో ఉన్న ఫీలింగ్‌ కలిగేలా గోడలను అందంగా తీర్చిదిద్దారు.
 
interiar decaration
తన ఇంటి పేరు అపోలో అని పెట్టుకున్న ఆమె ఇంటిని లోపలి వాతావరణాన్ని ఉపాసన చూపించారు. పవిత్ర రాజారామ్ ఇంటీరియర్ డెకరేషన్ చేసారు. ఉపాసన, రాంచరణ్ ఇద్దరు ప్రకృతి ప్రేమికులు. ఫారెస్ట్ అంటే వారికి ఇష్టం. పక్షులు కిలకిలలు, టైగర్ బొమ్మలు, కోతులు, ఆకాశంలో పుష్పక విమానం నుంచి బేబీ కి ఆశీస్సులు.. ఇలా అన్ని సుందరంగా మలిపించారు. ఇదో కొత్త ప్రపంచం అని పవిత్ర రాజారామ్ వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి