Maruthi, Satya Raj, Mohan Srivatsa and others
డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న బార్బరిక్ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, సత్యం రాజేష్, ఉదయ భాను వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌తో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం నాడు రిలీజ్ చేశారు.