ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్ శంకర్ దర్శకత్వం వహించే ''రోబో 2.0'' చిత్రం జనవరిలో విడుదలకాబోతున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా రజనీ కాంత్ మరో సినిమా కాలా కూడా ఏప్రిల్‌లో విడుదల కానుంది. నిజానికి ఈ చిత్రాన్ని రజనీకాంత్ పుట్టినరోజైన డిసెంబర్ 12న విడుదల చేయాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం.
ముంబైలో అణచివేతకు గురైన తమిళుల జీవనం నేపథ్యంలో ''కాలా'' సినిమాను పా రంజిత్ తెరకెక్కించారు. తమిళ - హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ చిత్రంలో నానా పటేకర్, హ్యూమా ఖురేషీ, అంజలి పాటిల్ కీలక పాత్రలు పోషించారు.