ఉపేంద్ర నటించిన కల్ట్ ఫిల్మ్ ఏ(A) చిత్రం తెలుగులో రీరిలీజ్

డీవీ

శుక్రవారం, 7 జూన్ 2024 (16:33 IST)
Upendra, Producer Lingam Yadav
ఇండస్ట్రీ ఎప్పుడూ కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటుంది. అందులో భాగమే ఈ 4కే రీరిలీజ్ ట్రెండ్. ఓల్డ్ బ్లాక్ బస్టర్ మూవీస్‌ను మరొక్కసారి హై క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై గ్రాండ్‌గా రీరిలీజ్ అవుతున్న చిత్రం ఏ(A). కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన ఈ చిత్రం ఓ ట్రెండ్. 1998లో అంటే సుమారు 26 సంవత్సారాల క్రితం విడుదలైన ఏ సినిమా ఓ కల్ట్ ఫిల్మ్‌గా నిలిచింది. ఆ రోజుల్లో 100 రోజులు ప్రదర్శించడమే కాదు దాదాపు 3, 4 వారాలు టికెట్లు సైతం దొరకలేదంటే ఆ సినిమా చేసిన మ్యాజిక్ ను అర్థం చేసుకొవచ్చు. 
 
ఈ కల్ట్ సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకొస్తూ వింటేజ్ రోజులను తెరపై అవిష్కరింపజేస్తున్నారు ప్రొడ్యూసర్ లింగం యాదవ్. చందు ఎంటర్ టైన్మెంట్ స్థాపించి పలు చిత్రాలను నిర్మించడమే కాకుండా సినిమా అంటే ప్రేమతో రీరిలీజ్‌లకు పూనుకున్నారు. అందులో భాగంగా హీరో ప్రభాస్ నటించిన ఛత్రపతి, యోగి చిత్రాలను 4కే లో మళ్లీ విడుదల చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే కన్నడలో రీరిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన స్పందనను రాబట్టింది. ఇక జూన్ 21న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 
 
కన్నడ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఏ(A) బుద్దిమంతులకు మాత్రమే అనేది శీర్షిక. ఈ చిత్రంలో ఉపేంద్ర సరసన చాందినీ నటించారు. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం కన్నడలో 1998లోనే 20 కోట్లకు పైగా వసూల్ చేసి ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. అంతటి కల్ట్ ఫిల్మ్ జూన్ 21 న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందని సినిమా ప్రీయులు, ఉపేంద్ర ఫ్యాన్స్ తెగ సంబరం చేసుకుంటున్నారు. ఉపేంద్ర చేసే చిలిపి చేస్టలను తెరపై చూడాలని ఉవ్విల్లూరుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు