మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యాను : శ్రియా శరణ్

డీవీ

గురువారం, 22 ఫిబ్రవరి 2024 (16:24 IST)
Shriya Saran
కొన్ని షూటింగ్ లకు అండర్ కరెంట్ కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అలా తనకు జరిగిందని  శ్రియా శరణ్ చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె షో టైం అనే వెబ్ సిరీస్ చేసింది. దీని గురించి ఆమె అనుభవాలు చెబుతూ, “మేము ఈ షోటైం  షూటింగ్ చేస్తున్నప్పుడు, నా కుమార్తె తన చేతిని ప్రమాదవశాత్తూ కాల్చుకుంది. నేను నిర్లక్ష్యంగా ఉన్నందున ఇది జరిగిందనీ, అది వ్యక్తిగతంగా నాకు చాలా కఠినమైన సమయం.

కానీ ఏదో ఒకవిధంగా దాని నుంచి బయటపడాలంటే నటించాలి. అందుకే సెట్‌కి తిరిగి రావడం నన్ను శాంతింపజేసింది ఎందుకంటే ఆ టైంలో నేను మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యాను. షూటింగ్ లో పాల్గొన్నాక మనసు కుదుపడింది. ఇలాంటివి కొన్ని సార్లు జరుగుతుంటాయి. చాలా అండర్ కరెంట్స్ విషయాలుంటాయి. ఇలా ప్రతి సన్నివేశానికి బ్యాక్‌స్టోరీ ఉంటుంది అని అన్నారు.
 
- డబ్బు, వ్యాపారం, గ్లామర్, సంబంధాలు, జీవనశైలి, బాలీవుడ్‌లో అత్యంత రహస్యంగా ఉంచబడిన అన్ని రహస్యాలు, షోటైమ్ ప్రత్యేకంగా మార్చి 8న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలవుతోంది.

ఇమ్రాన్ హష్మీ, మౌని రాయ్, రాజీవ్ ఖండేల్‌వాల్, విశాల్ వశిష్ఠ, నీరజ్ మాధవ్, విజయ్ రాజ్, నసీరుద్దీన్ షా కీలక పాత్రల్లో నటించారు.
 సుమిత్ రాయ్ రూపొందించారు, షోరన్నర్ మరియు దర్శకత్వం మిహిర్ దేశాయ్ మరియు అర్చిత్ కుమార్ దర్శకత్వం వహించారు, సుమిత్ రాయ్, మిథున్ గంగోపాధ్యాయ మరియు లారా చాందిని స్క్రీన్ ప్లే అందించగా, జెహాన్ హండా మరియు కరణ్ శ్రీకాంత్ శర్మ సంభాషణలు రాశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు