చియాన్ విక్రమ్ కొత్త చిత్రం "వీర ధీర శూర". రెండో భాగం విడుదలకు ముందు చివరి నిమిషంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తాయి. దీంతో గురువారం విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదాపడింది. నాలుగు వారాల పాటు సినిమాను విడుదల చేయొద్దంటూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీంతో గురువారం ఉదయం పడాల్సిన షోలన్నీ రద్దు అయ్యాయి.
ఈ సినిమా విడుదలపై స్టే కోరుతూ ముంబైకు చెందిన ప్రొడక్షన్ కంపెనీ బీఫోర్యూ అనే కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. చిత్ర నిర్మాణ సంస్థ తమకు శాటిలైట్ హక్కులను విక్రయించిందని, ఆ ఒప్పందం ప్రకారం విడుదలకు ముందు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను విక్రయించకూడదని, నిర్మాతలు ఆ నిబంధనలు ఉల్లంఘిస్తూ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను విక్రయించారని తమ పిటిషన్లో పేర్కొంది.