జనతా కర్ఫ్యూను పాటించిన అనంతరం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు వైద్యులను కొనియాడేలా చప్పట్లు కొడుతూ సెల్యూట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏ మాత్రం ఛాన్స్ దొరికినా తమలోని రొమాంటిక్ యాంగిల్‌ను చూపించే నయన్, విఘ్నేష్‌లు ఈ సందర్భాన్ని కూడా అందుకే వాడుకున్నారు.
నయన్ చేయి ఒకటి, విఘ్నేష్ చేయి ఒకటి కలిపి చప్పట్లు కొడుతున్నట్టుగా ఉన్న ఫోటోను తన పేజ్‌లో పోస్ట్ చేసిన విఘ్నేష్, వీరుల కోసం చప్పట్లు కొడుతున్నాం. కరోనాతో పోరాటంలో అంతా క్రమశిక్షణ పాటించండి.. అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ సినిమా పోస్ట్‌కు ఎలాంటి రెస్సాన్స్ వస్తుందో విఘ్నేష్ ముందుగానే ఊహించినట్టున్నాడు, అందుకే కామెంట్లు కనిపించకుండా ఆపేశాడు విఘ్నేష్.