ఈ సినిమా ద్వారా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధీషన్‌ను విలన్‌గా పరిచయం చేస్తుండటం విశేషం. యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్‌ను చూస్తుంటే విజయ్ ఆంటోనీ, అజయ్ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండేలా కనిపిస్తోంది. ఈ రెండు పాత్రలు తలపడే సీన్లు ప్రేక్షకులకు ఆడ్రినలిన్ రష్ ఇచ్చేలా ఉంది. ఇందులో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కాగా, ఇప్పటికే మేజర్ పార్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూన్ 27న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఈ మేరకు వదిలిన కొత్త పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే హృద్యమైన కుటుంబ చిత్రంగా రానున్న ఈ చిత్రానికి యువ.ఎస్ సినిమాటోగ్రఫర్‌గా, విజయ్ ఆంటోని స్వయంగా సంగీతం సమకూర్చుతుండగా.. రాజా.ఎ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
తారాగణం: విజయ్ ఆంటోని, అజయ్ ధీషన్, సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి మరియు అంతగారం నటరాజన్