ప్రపంచాన్ని వణికించిన సైబర్ అటాక్ వాన్నా క్రై బాధితుల్లో జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ చేరాడు. ఆయన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. భారత దేశంలో అతిపెద్ద సంఖ్యలో ఫాలోవర్లు కలిగిన పవన్ కల్యాణ్ ట్విట్టర్ అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు.
మూడు రోజుల క్రితమే ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే అవలేదని, ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చని పవన్ భావించాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. అయితే చివరిగా తన అకౌంట్ హ్యాక్ అయినట్లు పవన్ కల్యాణ్ గుర్తించారని తెలిసింది.