చైతూ-సమ్మూతో ప్రేమ నిజమేనని.. ట్విట్టర్లో ఏమీ లేదని చెప్పినా.. ఆమె ప్రేమాయణం ఎప్పుడో మొదలైందన్నమాట నిజమని సినీ పండితులు చెప్తున్నారు. సమంత, చైతూ ప్రేమ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో.. వీరి పెళ్ళి సెప్టెంబరులో జరుగనుందని టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది.
వారి పెళ్లి సంగతిని పక్కనబెడితే.. సమంత, నాగచైతన్య లవ్ స్టోరీ మాత్రం వారు నటించిన ఏమాల చేసావె సినిమాతోనే మొదలైపోయిందని సినీ పండితులు అంటున్నారు. ఏ మాయ చేసావె సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి లవ్ జర్నీ మొదలైంది. అప్పటి నుంచే చెట్టాపట్టేలేసుకుని తిరిగారట. అంతేకాదు తమ తొలిసినిమాకు, తొలిప్రేమకు గుర్తుగా సమంత "ఏ మాయ చేశావే" సినిమా టైటిల్‌ను షార్ట్ చేసి వైఎమ్‌సీ అని వీపుపై టాటూ వేయించుకుందట ఈ బ్యూటీ.
"ఎన్" అనే గుర్తున్న లాకెట్‌ను మెడలో వేసుకున్న సమంత.. ఆ అక్షరమంటే తెగ ఇష్టమని చెప్పింది. దీంతో సమంత నాగచైతన్యను లవ్ చేస్తుందని అప్పట్లో గాసిప్స్ వినిపించాయి. ఈ న్యూస్ చూసి సమంత నవ్వి మిన్నకుండిపోతే.. చైతూ మాత్రం ఆమెతో ప్రేమ, పెళ్ళిపై ఏమాత్రం నోరెత్తట్లేదు. మరి ఈ వదంతులకు చైతూ-తమ్మూ ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో వేచిచూడాలి.