పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్టులో ఏముందంటే...

ఠాగూర్

శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (08:59 IST)
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి శ్రీ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇందుకోసం పోలీసులు తయారు చేసిన రిమాండ్ రిపోర్టు ఇపుడు బహిర్గతమైంది. ఇందులో ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై దారుణమైన రీతిలో అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశారని, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఆయన భార్యపై అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని పోలీసులు పేర్కొన్నారు. 
 
అలాగే, దళితులను కించపరిచేలా, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోసాని మాట్లాడారని, రాజకీయ నాయకులను, వారి కుటుంబాల్లోని మహిళలను కూడా బూతు వ్యాఖ్యలతో దూషించారని పేర్కొన్నారు. ముఖ్యంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై 14 కేసులు నమోదైవున్నాయని తెలిపారు. 
 
పోసాని కృష్ణమురళి సినీ రంగానికి చెందినవారు కావడంతో ఆయన మాటలు చాలా మందిపై ప్రభావం చూపుతాయని, పైగా కేసు విచారణకు ఆయన ఏమాత్రం సహకరించడం లేదిని ప్రస్తావించారు. వీటితో పాటు పోసాని ప్రవర్తన, ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు తదితర అంశాలను రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు