అందుకు స్పందించిన హరీశ్ శంకర్, సినిమా అనేది కేవలం ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే. పవన్ కళ్యాన్ గారు స్వతహాగా పర్యావరణ రక్షకుడు. ఆయన తగిన మంత్రిపదవి దక్కింది. తను ఓ సందర్భంలో సందర్భానుసారంగా మాట్లాడివుంటారు. అందులో తప్పేముంది? పుష్పలో చూపించినవిధంగా అందరూ గొడ్డళ్ళు పట్టుకుని అడవులకు వెళ్ళరు గదా. అపరిచితుడు, జాకీజాన్ సినిమాలలో హీరోలు చేసే పనులు ప్రేక్షకుడు చేయడు గదా? ఎవరి అభీష్టం మేరకు వారు ఆయా రంగాల్లో స్థిరపడతారు. ఏ సినిమా అయినా అది పాత్రమేరకే మనం చూడాలి. కథ రాసిన దర్శకుడు కోణం వేరుగా వుంటుంది. సినిమాలో చూపించినట్లుగా అన్ని జరిగితే దేశం మరో లెవల్లో వుంటుంది. సినిమా అనేది కొంతటైం మేరకు ఎఫెక్ట్ వుంటుంది. ఆ తర్వాత దాన్ని గురించి మర్చిపోతారు. దాన్ని పెద్ద కోణంలో సోషల్ మీడియా ఆలోచించి రకరకాల కథనాలు రాస్తూ మంచి ఉద్దేశ్యంతో అన్న మాటలు కూడా తప్పుదోవ పట్టించడం సమంజసం కాదని తన అభిప్రాయమని వెల్లడించారు.