రామ్ చరణ్ కొణిదెల హీరోగా ఆర్.ఆర్.ఆర్.లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఆస్కార్ నామినేషన్‌లో నాటునాటు సాంగ్ వెళ్ళగానే అది మరింత వ్యాప్తి చెందింది. కమల్‌హాసన్‌తో పాటు పలువురు తమ సినిమాలు ఆస్కార్‌వరకు వెళ్ళలేకపోయాయని బాధపడ్డారు కూడా. అలాంటిది రాజమౌళి తన జిమ్మిక్కులతో ఆస్కార్ వాళ్ళను ఆకట్టుకున్నాడు. కాగా, ఆర్.ఆర్.ఆర్. సినిమాకు ఇంకా హాలీవుడ్ నుంచి అభినందనలు వస్తూనే వున్నాయి. దర్శకుడు జేమ్స్ కేమరూన్ ప్రత్యేకంగా రామ్‌చరణ్ చేసిన రామరాజు పాత్ర గురించి రాజమౌళితో చర్చించడంతోపాటు తన సినిమా టైటానిక్ రీ రిలీజ్ టైంలో కూడా హాలీవుడ్ మీడియాతో రామ్‌చరణ్ పాత్ర గురించి ప్రస్తావించడం, అందుకు రాజమౌళి తీసుకున్న కేర్‌ను అభినందిస్తూ చిన్న వీడియో ట్వీట్ చేశాడు.