Telgu film chamber, council
తెలుగు సినిమా పరిశ్రమలో సహాయ దర్శకుడు గా పనిచేస్తున్నానని సిద్ధార్థ వర్మ అనే వ్యక్తి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఒక యువతిని సినిమాల్లో వేషాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసి ఆమెను మానభంగం చేయడం జరిగిందని, సదరు యువతి పోలీస్ వారికి ఫిర్యాదు ఇచ్చిందని వార్త పత్రికలు, టీవీలు ద్వారా తెలుసుకొని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్, తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ వారిని సిద్దార్థ వర్మ గురించి విచారించగా సదరు అసోసియేషన్ వారు సిద్దార్థ వర్మ తమ సభ్యుడు కాదని, అతను ఏ దర్శకుడు దగ్గర సహాయకుడిగా పనిచేయడం లేదని తెలిపినారు.