పవర్ స్టార్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన అత్తారింటికి దారేది చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళంలో రీమేక్ అవుతోంది. సెంటిమెంట్, కామెడీ, ఎమోషన్స్‌తో కూడిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
2013లో విడుదలైన తెలుగు అత్తారింటికి దారేది సినిమాలో సమంత - ప్రణీత కథానాయికలుగా నటించిన సంగతి తెలిసిందే. సమంత పాత్రలో మేఘ ఆకాశ్ .. నదియా పాత్రలో ఖుష్బూ కనిపించనున్నారు. ఇక తెలుగులో ప్రణీత చేసిన పాత్ర కోసం కేథరిన్‌ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే జార్జియాలో ఒక షెడ్యూల్ షూటింగును పూర్తిచేసిన ఈ సినిమా టీమ్, తదుపరి షెడ్యూల్‌ను హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్టుగా సమాచారం.