ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు-తెలుగు విద్యార్థులకు చేయూతినివ్వండి

శుక్రవారం, 27 డిశెంబరు 2019 (18:05 IST)
కృష్ణాజిల్లా విజయవాడ పి.బి సిద్ధార్థ కళాశాలలో డిసెంబర్ 27,28,29వ తేదీల్లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు జిల్లాకు సంబంధించిన 67 మంది కవులు, రచయితలకు ఆహ్వాన పత్రికలు పంపిన సమాచారాన్ని ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గుత్తి కొండ సుబ్బారావు, డా.జి.వి.పూర్ణచందులు తెలిపినట్లు "కళామిత్ర మండలి తెలుగు లోగిలి" జాతీయ సంస్థ అధ్యక్షులు డా.నూనె అంకమ్మరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. 
 
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం విజయవాడలో జరుగుతున్న"ప్రపంచ తెలుగు రచయితల మహాసభల"లో భాగంగా సురవరం ప్రతాపరెడ్డి వేదికపై కళామిత్ర మండలి తెలుగు లోగిలి జాతీయ అధ్యక్షులు డా.నూనె అంకమ్మరావు ప్రసంగిస్తూ నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషల ఔన్నత్యాన్ని చాటే విధంగా భాషలను సరళీకృతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 
 
తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు చేయూత నందిస్తూ తగిన ప్రోత్సాహకాలను ఏర్పాటు చేయాలని, నవతరానికి ఉపయోగపడే పాఠ్యాంశాల రూపకల్పన జరగాలని, గ్రంథాలయ వ్యవస్థను పరిపుష్టం చేయడానికి సన్నాహాలు చేపట్టాలని, నైతిక విలువలను తెలిపే విషయాలను బోధించాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు