సీక్వెల్ కు ట్విస్ట్ ఇచ్చిన అష్టదిగ్భంధనం మూవీ - రివ్యూ

శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (09:25 IST)
Ashtadigbandhanam crew
నటీనటులు: సూర్య భరత్ చంద్ర, విషిక కోట, విశ్వేందర్ రెడ్డి, మహేష్ రావుల్, రంజిత్, రోష్ని రజాక్, వివ రెడ్డి, నవీన్ పరమార్డ్, మణి పటేల్, విజయ్ కందగట్ల, యోగేందర్ సప్పిడి, మహమ్మద్ రజాక్, తదితరులు.
సాంకేతికత: కెమెరా: బాబు కొల్లబత్తుల, మ్యూజిక్: జాక్సన్ విజయన్, ఎడిటింగ్: నాగేశ్వర్ రెడ్డి బొంతల, నిర్మాత: మనోజ్ కుమార్ అగర్వాల్, రచన – దర్శకత్వం: బాబా పి.ఆర్. 
 
ఈమధ్య అంతా  కొత్తవారితో క్రైం, థ్రిల్లర్ కథలను ఎంచుకుంటున్నారు. అందులో ట్విస్టులుంటే ఆధరణ  ఉంటుంది. ఎక్కువగా ఓ.టి.టి. ఫార్మేట్ లో ఇల్లాంటివి వస్తున్నా సినిమాలు ఇప్పుడు వెండితెరపై కూడా వచ్చాయి. అంతా కొత్తవారితో తీసిన అష్టదిగ్భంధనం’. ‘ఎ గేమ్ విత్ క్రైమ్’ అనేది ట్యాగ్ లైన్. ట్యాగ్ లైన్‌కు తగ్గట్టుగానే క్రైమ్స్‌తో ఈరోజు విడుదలైంది.  ‘సైదులు’ తో డైరెక్టర్‌గా మారిన బాబా పీఆర్ రెండో సినిమాకే  థ్రిల్లర్ కథను ఎంచుకున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉందొ చూద్దాం.
 
కథ:
ఓపెనింగ్ షాట్.. ఓల్డ్ సిటీలో  మటన్ అమ్మే వాడి దగ్గరకి ముసుగు వేసుకున్న ఓ వ్యక్తి 100 కోట్ల మొత్తాన్ని హవాలాగా విదేశాలకు మార్చేలా టోకెన్ తీసుకుంటాడు. కట్ చేస్తే, బ్యాంక్లో 20 లక్షలు డబ్బులు డ్రా చేసిన ఓ పెద్దాయన బేగ్ ఇద్దరు కొట్టేస్తారు. పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైన్ట్ ఇస్తే, పర్సెంటేజ్ అడుగుతాడు ఎస్.ఐ . మరో వైపు లీడింగ్ పార్టీ లీడర్, తన  అనుచరుడు శంకర్ అనే రౌడీ షీటర్.కు 100 కోట్లు దాయమని ఇస్తాడు. తన తోటి రౌడీ షీటర్ రాజకీయ నాయకుడిగా మారి తననే అవమానిస్తుంటే ఇగో దెబ్బతిని తను కూడా ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలని శంకర్ నిర్ణయించుకుంటాడు. అధికార పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 50 కోట్లు చెల్లించేందుకు శంకర్ సిద్ధమవుతాడు. అందుకోసం ఓ పెద్ద ప్లాన్ వేస్తాడు.ఆ ప్లాన్ వర్క్ అవుట్ అయిందా? సి.ఐ.కి, హవాలా వ్యక్తికి, ఈ శంకర్ కు లింక్ ఏమిటి? ఆ తర్వాత ఏమి జరిగింది అనేదే సినిమా. 
 
సమీక్ష:
డబ్బే ప్రధానంగా ఈ సినిమా ఉంటుంది. ఇందులో దర్శకుడు పలు విషయాలు చర్చించాడు. రియల్ ఎస్టేట్ వెంచర్ పేరుతో మోసాలు చేయడం, రౌడీలు ఎం.ఎల్.ఏ. గా మారాలనుకోవడం, నిజాలు బయట పెట్టె టి.వి. ఛానల్ ను టార్గెట్ చేయడం, ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయనే విషయాలు కళ్లకు కట్టినట్లు చూపించాడు. అయితే అందుకు కొంత సినిమాటిక్ ను ఎంచుకున్నాడు. ఏది ఏమైనా మంచి చెప్పాలని ట్రై చేసి ఆ కోణంలో పలు ట్విస్ట్ లు చూపించాడు. 
 
కేవలం అహం  వల్ల మనిషి ఎంతకైనా తెగిస్తాడని తెలియజేశాడు. ఇప్పడు ఇదే దేశంలో ప్రధానమైన అంశం. ఈ కథలో పలు మలుపులు ఉన్నాయి. కాస్త సీనియర్ కాస్టింగ్ ఉంటె ఈ సినిమా చాలా పెడా హిట్ అయ్యేది. కొత్త వారితో చేయడం వారుకూడా బాగానే చేశారు. దర్శకుడు బాబా తనకు ఇది రెండో సినిమానే అయినా తన స్కీన్‌ప్లేతో మ్యాజిక్ చేశాడని చెప్పొచ్చు. ఫస్ట్ హాప్ అంతా ఎక్కడా బోర్ కొట్టకుండా సాఫీగా సాగిపోతుంది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని క్యారెక్టర్స్ గురించి సస్పెన్స్ క్రియేట్ చేసిన దర్శకుడు.. సెకెండాఫ్‌లో వాటికి కన్‌క్లూజన్ ఇచ్చాడు. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ అయితే ఊహించలేని విధంగా ఉంటుంది. 
 
సెకెండాఫ్ అంతా ఆసక్తితో నడిచిపోతుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకెండాఫ్‌లో దర్శకుడు ఎక్కువ ట్విస్టులను ప్లాన్ చేశాడు. హీరో బాగాస్ తో ఫైట్ చేసే ప్రాసెస్ లోనూ మరికొన్నిచోట్లా చీటింగ్ షాట్స్ చూపించి ప్రేక్షకుడిని గందరగొనాల పరిచినా ఫైనల్ గా రివర్స్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడు. ముగింపు కూడా మరో సినిమా రాబోతుందని చూపించాడు. నిర్మాత కొత్త వాడిన మంచి కథ ఎంచుకున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
 
హీరో  సూర్య భరత్ చంద్ర తన నటనతో పర్వాలేదనిపించాడు. హీరోయిన్ విషిక అందచందాలతో ఆకట్టుకుంది. రౌడీ షీటర్ శంకర్ పాత్ర చేసిన అతను విలనిజం బాగా పండించాడు. మంత్రి పాత్ర చేసిన సీనియర్ నటుడు  పాత్ర పరిధి మేరకు నటించారు. ఇక మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. అందరూ కొత్తవాళ్లతో దర్శకుడు సాహసం చేసాడనే చెప్పాలి. అందుకు అవుట్ ఫుట్ కూడా రాబట్టాడు. ఇంకా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఓ.టి.టి.కి మంచి  కంటెంట్ సినిమా ఇది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు