కొత్తదనం లేని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి - రివ్యూ

డీవీ

శుక్రవారం, 31 మే 2024 (15:31 IST)
Vishwak Sen
నటీనటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు
సాంకేతికత:  సినిమాటోగ్రఫీ: అనిత్ మధడి, సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా, ఎడిటింగ్: నవీన్ నూలి, నిర్మాతలు : సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య, దర్శకుడు: కృష్ణ చైతన్య
 
 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ విశ్వక్ సేన్ సినిమా కోసం చేసిన ప్రచారం మామూలుగా లేదు. ఎన్.టి.ఆర్.తో ఆయన్ను కొందరు పోల్చాడు. బాలక్రిష్ణ ప్రీరిలీజ్ కు వచ్చారు.  ఈ సినిమా టైటిల్ వినగానే ఇది రౌడీల సినిమా అని అర్థమయింది. పాటల రచయితగా పరిచయమైన కృష్ణ చైతన్య. దర్శకుడు  చల్ మోహన్ రంగా, రౌడీ ఫెలో సినిమాలు చేశాడు. మరి విశ్వక్ సేన్ తో చేసిన ఈ సినిమా ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
 
గోదావరి ప్రాంతం కొవ్వూరులోని ఓ లంకలో పుట్టిన రత్న(విశ్వక్సేన్) దొంగతనాలు చేస్తుంటాడు. జీవితంలో ఎలాగైనా సరే పెద్ద పదవిలో వుండాలనేది ఆయన పట్టుదల. దానికి సులైవన మార్గం ఎమ్మెల్యే దగ్గర జేరి ఆటోమేటిక్ గా ఎదగాలనుకుంటాడు. లా ఎమ్మెల్యే  దొరస్వామి ( గోపరాజు రమణ) క్యాంప్ లో చేరతాడు. ఆ తర్వాత టైం చూసి ఆయన వ్యతిరేకి అయిన  నానాజీ (నాజర్ ) తో చేతులు కలుపుతాడు. కపడమేకాకుండా నానాజీ కుమార్తను ప్రేమించేలా చేస్తాడు.
 
అలా ఇరువురికీ శత్రవుగా మారగా రత్నను లేపేయాలని వారు ప్లాన్ చేస్తారు. రత్న తప్పించుకుంటాడు. ఇంకోవైపు రౌడీ గ్యాంగ్ లో వుండగా పరిచయమైన స్నేహితులు కూడా శత్రవులుగా మారతారు. ఆ తర్వాత ఏమయింది. మధ్యలో రత్నమాల (అంజలి) పాత్ర ఏమిటి? తర్వాత కథె ఎటువైపు మలుపు తిరిగింది? అనేది మిగిలిన సినిమా. 
 
సమీక్ష
 
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్స్ ఎంత బాగా చేసినా గ్యాంగ్ స్టర్ కథలు అన్నీ ఒకేలా వుంటాయి. చదువు సంథ్య లేకపోయినా రౌడీగానో, ఎం.ఎల్.ఎ.గానో ఎదగడం ఈజీ అనేలా చాలా ఉదంతాలు జరిగాయి. సినిమాలూ వచ్చాయి. ఈ కథ చూడగానే పాత సినిమాలన్నీ గుర్తుకు వస్తాయి. ఇలాంటి కథకు కొత్తదనం అనేది పెద్దగా కనిపించదు. దర్శకుడు విశ్వక్ సేన్ ను, నిర్మాతను ఒప్పించడమే చాలా గొప్ప విషయం.
 
త్రివిక్రమ్ కూడా కొన్నిసూచనలు చేసినా పూర్తి మాస్ యాక్షన్ సినిమా కనుక తెలిసిన కథ కావడంతో పెద్ద కిక్ వుండదు.  సినిమా ఓపెన్ అయినప్పుడే విశ్వక్సేన్ క్యారెక్టర్ ఏమిటి అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. చాలా వరకు కథ ఎక్కడ జరుగుతుందో అర్థంకానంతగా దర్శకుడు రాసుకున్నాడు. తన ఎదుగుదల కోసం ఏమైనా చేసేందుకు సిద్ధమయ్యే క్యారెక్టర్ లో విశ్వక్ జీవించాడనే చెప్పాలి.  గోదావరి అంటే పచ్చటి పంట పొలాలు సెలసెల పారే గోదావరి మాత్రమే కాదు సల సలా రగులుతున్న పగలకు కూడా అడ్డానే అనే మెయిన్ పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. యాస బాగానే మాట్లాడాడు.
 
నటీనటులు పరంగా అందరూ బాగా చేశారు. గ్యాంగ్ స్టర్ కథ కాబట్టి విశ్వక్ కథను భుజాలపై మోసేశాడు. రెండు భిన్నమైన పాత్రలలో కనిపించిన విశ్వక్.  నేహా కంటే అంజలికి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్ర పరిధి మేరకు నటించారు. 
 
సాంకేతికంగా.. శంకర్ రాజా  పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. చైతన్య కృష్ణ రాసుకున్న డైలాగ్స్ చాలావరకు ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి.  స్క్రీన్ ప్లే మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేది.  సినిమాటోగ్రఫీ పర్లేదు. పించారు. ఇలాంటి మాస్ యాక్షన్ సినిమాలు బాలయ్య, జూ ఎన్.టి.ఆర్. లు ఎప్పుడో చేసేశాడు. ఆ రూటులో విశ్వక్ సేన్ మాస్ హీరోగా నిరూపించుకునేందుకు చేసిన ప్రయత్నంగా అనిపిస్తుంది.
రేటింగ్: 2. 25/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు