sashi, Vishnu Vardhan, Akash Murali, Aditi Shankar, Sneha Britto
ఆకాష్ మురళి, అదితి శంకర్(స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె) జంటగా పంజాఫేం విష్ణు వర్ధన్ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేమిస్తావా. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా తమిళంలో నేసిప్పాయా పేరుతో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మైత్రీమూవీ మేకర్స్ తెలుగులో విడుదల చేసేందుకు ముందుకొచ్చింది. ప్రేమిస్తావా అనే చక్కటి తెలుగు టైటిల్‌తో జనవరి 30న రాబోతుంది. ఈ నేపథ్యంలో తెలుగు ట్రైలర్ లాంచ్ వేడుకను మంగళవారం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు మేకర్స్.