ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకుడు. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్‌ను మార్చి 29న విడుదల చేశారు.
థియేటర్లలో ఒక పండగలా.. ఈ ట్రైలర్‌ను విడుదల చేయడం విశేషం. పవన్ కల్యాణ్ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర తారాగణంగా నటించారు.
ఇకపోతే, టైటిల్‌కి తగినట్లే స్టార్టింగే కోర్టు సీన్‌తో ట్రైలర్ మొదలవుతుంది. అమ్మాయిలకు జరిగిన అన్యాయంపై పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్‌ల మధ్య వాద, ప్రతివాదనలతో కోర్ట్ సీన్ దద్దరిల్లిపోయేలా స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండటమే కాదు.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేదిగా ఉంది.
పవన్ చెప్పే డైలాగ్స్ విషయంలో దర్శకుడు శ్రీరామ్ వేణు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నట్లుగా ట్రైలర్ చూస్తుంటే తెలిసిపోతుంది. అన్యాయంగా కేసులో బుక్కయిన ముగ్గురు అమ్మాయిలు.. న్యాయం కోసం పోరాడి పోరాడి విసిగిపోయిన టైమ్‌లో.. లాయర్ రూపంలో పవన్ వారికి దేవుడిలా కనిపించడం.. వారి తరపున వాదించి.. వారిని ఎలా ఈ కేసులో నుంచి బయటికి తీసుకువచ్చాడు అనేదే స్టోరీ అనేది అర్థమవుతుంది.