వేంకటేశునికి తలనీలాలు సమర్పించడంలో ఆంతర్యమేమిటి...?

WD
వెంట్రుకలు, గోళ్లు మన పాపాలకు ప్రతీకలుగా చెప్పబడ్డాయి. అందువల్లనే ఆ సర్వాంతర్యామికి తలనీలాలిచ్చి పాప విముక్తిని పొందుతాం.

పూర్వం సువాసినులకు, సన్యాసులకు ముండనం చేయించుకోవడంలో ఆంతర్యమిదే.

అంతేకాదు గంగానది వంటి పుణ్యనదులలో స్నానం చేసే ముందు స్త్రీలు, పురుషులు జుట్టు, గోళ్లు తీయించుకుని నీళ్లలో పడవేయడం, తండ్రి తాతలు మరణిస్తే జుట్టు తీయించుకోవడం మొదలైన ఆచారాలలోని ఆంతర్యం కూడా ఇదేనని శాస్త్ర వచనం.

వెబ్దునియా పై చదవండి