కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి ప్రారంభంకానున్న బ్రహ్మోత్సవాలకు వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా ఈరోజు అంకురార్పణ జరుగనుంది. సంప్రదాయబద్దంగా ఆలయ చుట్టూ ప్రదక్షణలు చేసి నవ ధాన్యాలతో అంకురార్పణ చేస్తారు.
దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు విచ్చేసే ఈ బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. లక్షల సంఖ్యలో విచ్చేసే భక్తులకోసం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లును చేసింది. మరోవైపు దేశం నులుమూలల నుంచి అశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో నిఘా వర్గాలు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నాయి.