సోషల్ మీడియాలో 2024 వైఎస్‌ఆర్‌సిపి మంత్రుల లిస్ట్ వైరల్, మిస్ అయిన వంగా గీత, రోజాల పేర్లు

ఐవీఆర్

బుధవారం, 15 మే 2024 (13:27 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసాయి. కొన్నిచోట్ల అల్లర్లు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ విధించారు. శాంతిభద్రతల అదుపు రీత్యా ఈ చర్య తీసుకున్నారు. ఇదిలావుంటే ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామంటే తమదే విజయమని అటు ఎన్డీయే ఇటు వైసిపి నాయకులు చెప్పుకుంటున్నారు. వైసిపికి చెందిన కొంతమంది అభిమానులైతే ఏకంగా జూన్ 4 తర్వాత మంత్రి పదవులను చేపట్టేవారి జాబితాను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వున్నారు.
 
వైరల్ అవుతున్న ఓ లిస్టులో డిప్యూటీ సీఎం చేస్తానంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పిన వంగా గీత పేరు లేదు. అలాగే పర్యాటక శాఖామంత్రి రోజా పేరు కూడా మిస్ అయ్యింది. ఈ పేర్లు ఏమయ్యాయి అంటూనే లిస్టులో వున్నవారిలో ఐదుగురికి మించి గెలవరంటూ మరికొంతమంది నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.



క్యాబినెట్ ఫైనల్ లిస్ట్

జగన్ మోహన్ రెడ్డి,SRK sir చర్చించిన మంత్రి మండలి కూర్పు
జగన్ లండన్ నుండి తిరిగివచ్చాక మరోసారి ముఖ్య నేతలతో భేటీ
B C లకు పెద్ద పీట

1. Thammineni Seetharam
2. Viswasarayi Kalavathi
3. Botcha Satyanarayana
4. Mpic.twitter.com/ZrbELqpkFd

— Java (@JavaYsrcp) May 15, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు