పాట్నా మీదుగా రాజ్‌గిర్ నుంచి వస్తున్న బుద్ధ పూర్ణిమ ఎక్స్‌ప్రెస్ మరికొద్దిసేపట్లో గయా జంక్షన్ వద్ద ఆగబోతోంది. ఇంతలో రైలు ఇంజిన్ నుంచి నుంచి పెద్దపెద్ద ఏడుపులు, కేకలు వినిపించాయి. అవి ఎటు నుంచి వస్తున్నాయో అర్థంకాలేదు.
ఇంతలో రైలు గయా స్టేషను వద్దకు చేరుకోగానే... డ్రైవర్ రైలు దిగి అటుఇటూ చూసాడు. ఐతే రైలు ఇంజిన్ కింద నుంచి ఏడుపులు, మంచినీళ్లు కావాలంటూ కేకలు వినిపించాయి. రైలు కింద చూస్తే ఓ వ్యక్తి కనిపించాడు. అతడిని చూసి అక్కడున్నవారంతా షాక్ తిన్నారు. మెల్లగా అతడిని రైలు ఇంజిన్ కింద నుంచి బయటకు లాగారు. రైలు డ్రైవర్ స్థానిక పోలీసు అధికారులకు విషయాన్ని చెప్పాడు.
ఐతే వారు వచ్చేలోపుగానే ఇతడు పరారయ్యాడు. అతడి కోసం గాలిస్తున్నారు. ఐతే రైలు ఇంజిన్ కింది భాగం విపరీతమైన వేడితో పాటు, వేగానికి కింద జారిపడిపోయే అవకాశం కూడా వుంది. అలాంటిది సుమారు 200 కిలోమీటర్ల ప్రయాణాన్ని అతడు ఎలా చేసాడా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.