బరువు తగ్గాలా..? ఈ పోలీస్ ఆఫీసర్‌ను ఫాలోకండి.. 48 కేజీలు తగ్గారట!?
శుక్రవారం, 24 జూన్ 2022 (09:37 IST)
ASI Reduced Weight
బరువు తగ్గడానికి నానా తంటాలు పడుతున్నారా? అయితే ఈ పోలీస్ ఆఫీసర్‌ను ఫాలో అవ్వండి. అవును.. చాలా మంది పెరిగిన బరువును తగ్గించేందుకు చాలా కష్టాలు పడుతుంటారు. కానీ ఓ పోలీస్ యోగా, ఎక్సర్ సైజు, మెడిసిన్స్ వాడకుండానే 48కేజీలు తగ్గారు.
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని బలోదబజార్-భటపరా జిల్లాలోని సర్సివాన్ ప్రాంతానికి చెందిన విభవ్ తివారీ ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. కేవలం రెంటు చిట్కాలతోనే ఆయన బరువు తగ్గాడు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెంటు పూటలా క్రమం తప్పకుండా వాకింగ్ వెళ్లాడు.
అలాగే ఆహార పదార్థాల్లో నూనె వాడకాన్ని బాగా తగ్గించడమే కాదు ఒక్కోసారి నూనె లేకుండా వంటకాలు చేసి తినడం మొదలెట్టారు. అలా 9 నెలల్లోనే విభవ్ తివారీ 48 కేజీలు తగ్గారు. ఇంకేముంది.. బరువు తగ్గాలనుకునేవారు ఈ చిట్కా పాటించండి.