ప్రస్తుతం కరోనా వచ్చినవారు అది తగ్గడానికి మార్గాలు ఎంచుకుంటున్నారు. మరికొందరైతే కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ఏమేం చేయాలో అదంతా చేస్తున్నారు. ఇంగ్లీషు మందులతో పెద్దగా ఉపయోగం ఉండడం లేదని.. మైల్డ్‌గా కరోనా సోకిన వారు మాత్రమే బతికి బట్టకడుతున్నారని.. మిగిలిన వారు మృత్యువాత పడుతున్నారని జనంలోకి వెళ్ళిపోయింది.
కరోనా వస్తే తిప్పతీగ వైద్యం చేయడంతో ఐదురోజుల్లోనే నెగిటివ్ వచ్చేస్తోందట. ఇంగ్లీషు మందులను నమ్ముకోవడం మానుకున్న జనం ఆయుర్వేద మందులపై పడ్డారు. అయితే దీన్ని ఇంతవరకు ఆయుర్వేద నిపుణులు దృవీకరించలేదు. జనం నమ్మకంతోనే వీటిని వాడేస్తున్నారట. ఐదురోజుల తరువాత నెగిటివ్ వస్తుందని చెపుతున్నారు. మరి ఈ మందు నిజంగానే కరోనాపై దాడి చేసి చంపేస్తుందా లేదో?