అన్నాడిఎంకే పార్టీలో జయలలిత మరణం తరువాత ఇక చిన్నమ్మ శశికళ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం ఖాయమనుకున్నారు అందరూ. అయితే ముఖ్యమంత్రి అవ్వడానికి సరిగ్గా ఒకరోజు ముందుగానే ఆమె అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళింది. కానీ జైలుకు వెళ్ళేదాని కన్నా ముందు ఆమె తనకు అత్యంత సన్నిహితంగా ఉండే పళణిస్వామికే ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది.
శశికళను బాగా ముంచారు. ఇదంతా తెలిసిందే. కానీ బెంగుళూరు నుంచి తిరిగి వచ్చేసిన శశికళ చివరకు పళణిస్వామి, పన్నీరుసెల్వంలనే టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. కానీ అంతకన్నా ముందే సిఎం, డిప్యూటీ సిఎంలే టార్గెట్ చేశారు.
శశికళ బెంగుళూరు నుంచి రాగానే నేరుగా చెన్నైకు వెళ్ళిన మరుసటి రోజు ఆమె బంధువులకు సంబంధించిన ఆస్తులను జప్తులు చేయించారు. ఇళవరసి, సుధాకరన్‌కు చెందిన కోట్లాదిరూపాయల ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసింది. అంతకుముందే జయలలిత సమాధి వద్దకు శశికళ వెళ్ళాలనుకుంటే అక్కడ ఆపేశారు.