Ready for Rishi: యూకే ప్రధానమంత్రి అయ్యేందుకు యత్నిస్తున్నానంటున్న రిషి సునక్

శనివారం, 9 జులై 2022 (11:32 IST)
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో మాజీ ఛాన్సలర్ రిషి సునక్ ఈరోజు తదుపరి యూకె ప్రధానమంత్రి కావడానికి తన ప్రయత్నాన్ని ప్రారంభించారు. ఈ క్షణాన్ని ఎవరైనా పట్టుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాలనీ, అందుకే తను కన్జర్వేటివ్ పార్టీకి, మీ ప్రధాన మంత్రికి తదుపరి నాయకుడిగా నిలబడతానని సునక్ ట్విట్టర్‌లో విడుదల చేసిన ప్రచార వీడియోలో తెలిపారు.

 
రిషి సునక్ తాతలు పంజాబ్ నుండి వచ్చారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని వివాహం చేసుకున్న రిషికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీడియోలో 49 ఏళ్ల ఎంపీ రిషి మాట్లాడుతూ... మెరుగైన జీవితం కోసం ఆశతో ఓ యువతి ఇంగ్లాండ్‌కు విమానం ఎక్కిందనీ, ఆమే తన అమ్మమ్మ అంటూ ఆమె కథను పంచుకున్నారు.

 
"ఆమె ఉద్యోగం సంపాదించగలిగింది. కానీ ఆమె భర్త, పిల్లలు, తగినంత డబ్బు ఆదా చేయడానికి దాదాపు ఒక సంవత్సరం పట్టింది" అని రిషి సునక్ వీడియోలో తెలిపారు. కుటుంబమే తనకు సర్వస్వం అని చెప్పారు రిషి.

I’m standing to be the next leader of the Conservative Party and your Prime Minister.

Let’s restore trust, rebuild the economy and reunite the country. #Ready4Rishi

Sign up https://t.co/KKucZTV7N1 pic.twitter.com/LldqjLRSgF

— Ready For Rishi (@RishiSunak) July 8, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు