Biryani-Chicken Fry కేరళ అంగన్‌వాడీల్లో ఉప్మా వద్దు... బిర్యానీ, చికెన్ ఫ్రై ఇస్తే బాగుండు.. బాలుడి వీడియో వైరల్ (video)

సెల్వి

మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (11:35 IST)
kerala Boy
కేరళలోని అంగన్‌వాడీలో ఉప్మాకు బదులుగా బిర్యానీ, చికెన్ ఫ్రైని అడిగిన ఓ బాలుడి వీడియో వైరల్ అవుతోంది. దీంతో కేరళలోని పిల్లల సంరక్షణ కేంద్రాలలో భోజన ప్రణాళికలను సవరించడం గురించి చర్చ మొదలైంది. శంకు అనే బాలుడు చేసిన ఈ విన్నపానికి సంబంధించిన వీడియోను సోమవారం ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి వీణా జార్జ్ తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. 
 
శంకు చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటామని, అంగన్‌వాడీ మెనూను సమీక్షిస్తామని జార్జ్ తన పోస్ట్‌లో తెలిపారు. "శంకు సూచనను పరిశీలిస్తాము" అని మంత్రి అన్నారు. అంగన్‌వాడీల ద్వారా ఇప్పటికే వివిధ రకాల పోషకమైన భోజనాలు అందిస్తున్నామని, ప్రస్తుత వ్యవస్థ పిల్లలకు అవసరమైన పోషకాహారం అందేలా చూస్తుందని జార్జ్ వివరించారు. ఈ కేంద్రాలలో ఆహార సరఫరాలను పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా మంత్రి హైలైట్ చేశారు.
 
ఈ ప్రభుత్వం కింద, అంగన్‌వాడీల ద్వారా గుడ్లు, పాలు అందించే పథకం విజయవంతంగా అమలు చేయబడింది. మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహకారంతో, స్థానిక సంస్థలు కూడా కేంద్రాలలో వివిధ రకాల ఆహారాలను అందిస్తున్నాయి" అని ఆమె చెప్పారు. 
 
ఇకపోతే.. వీడియోలో, టోపీ ధరించిన పిల్లవాడు, అంగన్‌వాడీలో సాధారణ ఉప్మాకు బదులుగా తన తల్లిని బిర్యానీ, చికెన్ ఫ్రై అడుగుతున్నట్లు వినవచ్చు. అతను ఇంట్లో బిర్యానీ ప్లేట్ ఆస్వాదిస్తున్నప్పుడు అతని తల్లి అతని అభ్యర్థనను రికార్డ్ చేసి, తరువాత దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అుతోంది. 
 
అప్పటి నుండి, శంకుకి బిర్యానీ, చికెన్ ఫ్రై అందించమని ఆఫర్ చేస్తూ చాలా మంది నుండి ఆ కుటుంబానికి ఫోన్లు వచ్చాయి. "వీడియో చూసిన తర్వాత, శంకుకు బిర్యానీ, చికెన్ ఫ్రై అందించే కొంతమంది వ్యక్తుల నుండి మాకు కాల్స్ వచ్చాయి" అని అతని తల్లి ఒక వార్తా ఛానెల్‌కు తెలిపింది.
 
ఈ వీడియోకు నెటిజన్ల నుండి మద్దతు లభించింది. పిల్లలకు మంచి భోజనం అందించాలని చాలామంది అంగీకరించారు. జైళ్లలో ఖైదీలకు అందించే ఆహారాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించవచ్చని, అంగన్‌వాడీలలోని పిల్లలకు,  పోషకమైన భోజనం అందించవచ్చని కొందరు సూచించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by TRIJAL_S_SUNDHAR (@trijal_s_sundhar)

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు