బీజేపీ నేతలకు చేతబడి చేశారు.. అందుకే వరుస మరణాలు : సాధ్వీ ప్రజ్ఞాసింగ్

సోమవారం, 26 ఆగస్టు 2019 (19:00 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్ మరోమారు వార్తల్లోకెక్కారు. ఇటీవలి కాలంలో బీజేపీ నేతలు వరుసగా చనిపోతున్నారు. ఈ మరణాలపై కమలనాథులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధ్వీ ప్రజ్ఞాసింగ్ స్పందిస్తూ, తమ పార్టీ నేతలకు చేతబడి చేశారనీ అందుకే వరుసగా చనిపోతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
కాగా గత యేడాది కాలంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి మొదలుకుని తాజాగా అరుణ్ జైట్లీ వరకు అనేక మంది చనిపోయారు. ముఖ్యంగా, 20 రోజుల వ్యవధిలో అగ్రనేతలుగా ఉన్న సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలు అనారోగ్యం కారణంగా చనిపోయారు. దీంతో బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. 
 
ఈ క్రమంలో సోమవారం విలేకరులతో మాట్లాడిన భోపాల్‌ ఎంపీ సాధ్వి ప్రఙ్ఞా, 'బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు క్షుద్ర పూజలు చేయిస్తున్నాయని మహారాజ్‌ గారు నాకు ఒకానొక సమయంలో చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే మాకు ఇప్పుడు చెడుకాలం జరుగుతోంది. అయితే అప్పుడు ఆయన చెప్పిన విషయాన్ని నేను మర్చిపోయాను. కానీ మా పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు ఒక్కక్కరుగా మమ్మల్ని విడిచి వెళ్తున్నారు. మహారాజ్‌ చెప్పింది నిజమేనేమోనని నాకు ఇప్పుడు అనినిపిస్తోంది' అని వ్యాఖ్యానించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు